News

సమావేశాలను 15 రోజులు నిర్వహించాలి


ఏపీ అసెంబ్లీ సమావేశాలను 15 రోజులు నిర్వహించాలని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. నామమాత్రంగా సమావేశాల నిర్వహణ సరికాదని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. సమావేశాలను ఈవెంట్ మేనేజ్‌మెంట్‌లా చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజాసమస్యలపై సుదీర్ఘ చర్చ జరపాలని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. స్విస్‌చాలెంజ్, సదావర్తి భూములు, కరువు, సదావర్తి భూముల్లో అవినీతిపై చర్చ జరపాలని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.